News August 16, 2024

NZB: ముడో విడతలో రైతులకు రుణమాఫీ.!

image

రైతు రుణమాఫీలో భాగంగా జిల్లాలో 11,411రైతు కుటుంబాలకు గాను 15,724 లోన్ ఖాతాలు అర్హత పొందడ సుమారు రూ.190.33కోట్లు ప్రభుత్వం మాఫీ చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు ప్రభుత్వం విడుదల చేసింది. అయితే మండలాలు, గ్రామాల వారీగా లబ్దిదారుల పేర్లు వ్యవసాయశాఖకి అందలేదు. దీంతో 2 లేదా 3 రోజుల్లో రైతుల లోన్ అకౌంట్లలో జమయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Similar News

News September 13, 2024

NZB: అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు శనివారం సెలవు రద్దు: DEO

image

నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు శనివారం సెలవు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. సాధారణంగా రెండో శనివారం సెలవు దినమని కానీ, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ నెల 2వ తేదీన సెలవు ఇచ్చిన నేపథ్యంలో 14వ తేదీన రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

News September 13, 2024

ఆర్మూర్: 108 రకాల నైవేద్యాలతో వినాయకుడి పూజ

image

ఆర్మూర్ పట్టణంలోని మహాలక్మి కాలనీలో గల శ్రీ మహాలక్ష్మి గణేశ్ మండలి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 108 రకాల నైవేద్యాలతో వినాయకుడి పూజలు నిర్వహించారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా కాలనీలోని మహిళలు 108 రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించి ప్రత్యేకంగా అలంకరించారు. కాలనీవాసులు పెద్దఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

News September 13, 2024

KMR: ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవము ఈనెల 17న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం జిల్లా కార్యాలయాల భవన సముదాయం సమావేశ మందిరంలో ఎస్పీ సిందూ శర్మతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ నెల 17 న తెలంగాణా ప్రజాపాలన కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో నిర్వహిస్తామని తెలిపారు.