News March 23, 2025
NZB: మునగ చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

మునగ చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు టూ టౌన్ ఎస్ఐ అరాఫత్ అలీ తెలిపారు. ఆనంద్ నగర్‌కు చెందిన లక్ష్మణ్(56) ఈ నెల 18వ తేదీన పని కోసం బయటకు వెళ్లాడు. అనంతరం ఓ మునగ చెట్టు కనపడడంతో దానిపైకి ఎక్కిగా చెట్టు విరిగి కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన లక్ష్మణ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరాకు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 29, 2025
NZB: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పోలీస్ శాఖ తరఫున విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజలందరూ ఎలాంటి అభద్రతాభావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ప్రజలు శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
News March 29, 2025
NZB: మీ సేవ సర్వర్ డౌన్‌తో ఇబ్బందులు

మీ సేవ సెంటర్లలో శనివారం సర్వర్ డౌన్ ప్రాబ్లమ్ ఎదురైంది. దీనితో మీ సేవ సెంటర్లకు వెళ్లిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా సర్వర్ డౌన్ చూపగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సెంటర్లలో పడిగాపులు కాశారు. కాగా రాజీవ్ యువ వికాస పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అధిక సంఖ్యలో అభ్యర్థులు రావడంతో ఈ ఇక్కట్లు అని తెలిసింది.
News March 29, 2025
నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే?

నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. శుక్రవారం మెండోరాలో 41.5℃, పెర్కిట్, మోర్తాడ్, కోటగిరి 41.4, మల్కాపూర్, వేంపల్లె 41.3, లక్మాపూర్, యడపల్లి 41.2, ముప్కాల్, వైల్పూర్ 41.1, కమ్మర్పల్లి, యర్గట్ల, కొండూరు 41, బాల్కొండ 40.9, మంచిప్ప 40.8, గోపన్నపల్లి, తొండకూర్ 40.7, మోస్రా, మగ్గిడి 40.5, రెంజల్, సిరికొండ, భీంగల్, మాచెర్ల 40.4, ధర్పల్లి, గన్నారం, కోనసమందర్లో 40.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.