News August 9, 2024

NZB: మున్సిపల్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు

image

నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ నరేందర్ పై ఏసీబీ నిర్వహించిన దాడుల్లో రూ.6.07 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. ఇంట్లో ఏకంగా రూ.2.93 కోట్ల నగదును, ఆయన భార్య బ్యాంకు అకౌంట్లో రూ.1.10 కోట్ల నగదు ఉన్నట్లు తేల్చారు. అలాగే అర కిలోకు పైగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 1.98 కోట్లు విలువ చేసే 17 స్థిరాస్తులను గుర్తించినట్లు ఏసీబీ గుర్తించింది.

Similar News

News September 10, 2024

కామారెడ్డి: అష్టావధాని ఆయాచితం నటేశ్వరశర్మ కన్నుమూత

image

ప్రఖ్యాత కవి,అష్టావధాని డాక్టర్ ఆయాచితం నటేశ్వరశర్మ మంగళవారం అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. రామారెడ్డి మండలానికి చెందిన నటేశ్వర శర్మ సంస్కృతంలో 50కి పైగా రచనలు రాశారు. డాక్టర్ నటేశ్వర శర్మ రచనలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2023లో దాశరథి పురస్కారంతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ నటేశ్వర శర్మ కన్నుమూయడంతో కవులు, కళాకారులు శోక సముద్రంలో మునిగారు.

News September 10, 2024

జక్రాన్‌పల్లి: చోరీకి గురైన శివలింగం

image

నూతనంగా నిర్మించనున్న శివాలయం స్థలంలో తాత్కాలికంగా ప్రతిష్ఠించిన శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. మండలంలోని మునిపల్లి గ్రామంలోని వడ్డెర కాలనీలో నిర్మించనున్న గుడి స్థలంలో ప్రతిష్ఠించిన శివలింగం చోరీకి గురైనట్లు స్థానికులు కాలనీవాసులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 10, 2024

NZB: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

డిచ్పల్లి మండలం రాంపూర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే వృద్ధాశ్రమంలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ ఆంజనేయులు తెలిపారు. హోమ్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ కోఆర్డి నేటర్, ఏఎన్ఎం, వంట మనిషి, వంట సహాయకుడు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 18లోపు రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.