News November 20, 2024

NZB: మూత్ర విసర్జనకు వెళ్లి కింద పడి ఒకరు మృతి

image

మద్యం మత్తులో మూత్ర విసర్జనకు వెళ్లి కింద పడి ఒకరు మృతి చెందారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన శ్రీనివాస్(40) ఓ పెట్రోల్ బంకులో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి మద్యం తాగి న్యాల్ కల్‌కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన మూత్ర విసర్జనకు వెళ్లాడు. మద్యం మత్తులో కింద పడిపోవడంతో మృతి చెందాడు. 5వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గంగాధర్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News November 14, 2025

NZB: ఇది ప్రజా విజయం: మహేష్ కుమార్ గౌడ్

image

జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ప్రజా విజయమని TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం అయినా నిజామాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసముంచి తమ అభ్యర్థిని గెలిపించారని అన్నారు. ఇది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సంకేతమని అభివర్ణించారు.

News November 14, 2025

NZB: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం: మహేష్ కుమార్

image

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన NZBలో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం తమదేనన్నారు. GHMC ఎన్నికలలోనూ ఇదే ఫలితాలు వస్తాయని, రాబోయే ఏ ఎన్నిక అయినా ఫలితం కాంగ్రెస్ దే నన్నారు. BRSకు ప్రజలు సెలవు ఇచ్చారని, ఆ పార్టీకి స్థానం లేదన్నారు. బీహార్ ఎన్నికలపై పూర్తి ఫలితాలు వచ్చాక స్పందిస్తానని అన్నారు.

News November 14, 2025

NZB: జిల్లా కాంగ్రెస్ భవన్ లో నెహ్రు జయంతి వేడుకలు

image

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) భవన్‌లో శుక్రవారం భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.