News November 20, 2024

NZB: మూత్ర విసర్జనకు వెళ్లి కాలువలో పడి మృతి

image

మూత్ర విసర్జన కోసం వెళ్ళిన ఓ వ్యక్తి కాలువలో పడి మృతి చెందినట్లు నిజామాబాదు పట్టణంలోని 5వ టౌన్ ఎస్ఐ గంగాధర్ బుధవారం తెలిపారు. మహారాష్ట్రకు చెందిన కపిల్ అనే యువకుడు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిన్న రాత్రి మద్యం మత్తులో న్యాల్కల్ రోడ్డు ప్రాంతంలో మూత్ర విసర్జన కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 22, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు NZB క్రీడాకారులు

image

నవీపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో గురువారం రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్-17 విభాగంలో ఉమ్మడి జిల్లాలకు చెందిన 38 మంది బాలికలు, 28 మంది బాలురు పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో నుంచి ఐదుగురు బాలికలు, 8మంది బాలురు ఈ నెల 23 నుంచి 25వ తేది వరకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో జరిగే రాష్ట్రస్థాయి  పోటీల్లో పాల్గొనడానికి ఎంపిక అయ్యారు.

News November 21, 2024

KMR: అధికారులతో కలెక్టర్ వీడియో సమీక్ష

image

కులగణన సర్వేను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసి, డేటా ఎంట్రీ ప్రారంభించారని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. గురువారం MPDOలు, MROలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే పనులు ఎన్యుమరేషన్ బ్లాక్ వారిగా పూర్తిచేసి డేటా నమోదు చేయాలన్నారు. ఇప్పటివరకు 11 మండలాల్లో 100%, జిల్లావ్యాప్తంగా 96.3% ఎన్యుమరేషన్ పూర్తయిందన్నారు.

News November 21, 2024

నిజామాబాద్: శిక్షణ పూర్తి చేసుకున్న 250 మంది కానిస్టేబుళ్లు 

image

నిజామాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సుమారు 250 మంది పోలీసులు తమ శిక్షణను పూర్తి చేసుకున్నారు. జిల్లాలోని ఎడపల్లి మండలంలో గల జానకంపేట పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో గురువారం పాసింగ్ అవుట్ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ ఇన్‌ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.