News November 20, 2024

NZB: మూత్ర విసర్జనకు వెళ్లి కాలువలో పడి మృతి

image

మూత్ర విసర్జన కోసం వెళ్ళిన ఓ వ్యక్తి కాలువలో పడి మృతి చెందినట్లు నిజామాబాదు పట్టణంలోని 5వ టౌన్ ఎస్ఐ గంగాధర్ బుధవారం తెలిపారు. మహారాష్ట్రకు చెందిన కపిల్ అనే యువకుడు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిన్న రాత్రి మద్యం మత్తులో న్యాల్కల్ రోడ్డు ప్రాంతంలో మూత్ర విసర్జన కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 11, 2026

NZB: పదో తరగతి పరీక్షలకు ఎన్ని సెంటర్లంటే..

image

NZB జిల్లాలో ఈనెల 14 నుంచి SSC పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాటును చేసింది. జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య:24,399
అబ్బాయిలు:12,244,
అమ్మాయిలు:12,155,
పరీక్షా కేంద్రాల సంఖ్య:144
చీఫ్ సూపరింటెండెంట్ల:144
డిపార్ట్‌మెంటల్ అధికారుల:144
ఇన్విజిలేటర్లు: 1,214 ఉన్నారు. అలాగే విద్యార్థుల సౌకర్యార్థం
జిల్లా హెల్ప్ లైన్ నంబర్: 9030282993ను ఏర్పాటు చేశారు.

News March 11, 2026

ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి: సీపీ సాయి చైతన్య

image

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పోలీస్ శాఖ అమలు చేయాల్సిన 99 రోజుల కార్యక్రమాలపై సీపీ సాయి చైతన్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిబ్బంది కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా గ్రామాలను సందర్శించి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు చేరువగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News March 10, 2026

NZB: ఇంటర్ పరీక్షలు.. 377 మంది గైర్హాజరు

image

NZB జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం భౌతికశాస్త్రం, అర్ధ శాస్త్రం, ఒకేషనల్ పరీక్షలకు 377 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DIEO రవికుమార్ తెలిపారు. మొత్తం 16,678 మంది విద్యార్థులకు గాను 16,301 మంది హాజరయ్యారన్నారు. జనరల్‌లో 14,305మంది విద్యార్థులకు గాను 13,997 మంది విద్యార్థులు, ఒకేషనల్‌లో 2,373 మంది విద్యార్థులకు గాను 2,304 మంది పరీక్షలు రాశారు.