News May 18, 2024
NZB: మెడికల్ కాలేజ్‌లో కలకలం రేపుతున్న ఆత్మహత్యలు

నిజామాబాద్‌లోని మెడికల్ కాలేజ్‌లో ఆత్మహత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం కాళశాలలో ఓ మహిళా జూనియర్ డాక్టర్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పిడింది. గమనించిన స్నేహితులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా ఇదివరకు అక్కడ జరిగిన ఆత్మహత్య ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. అయితే అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
Similar News
News July 6, 2025
NZB: ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నట్లు నిజామాబాద్ 4వ టౌన్ SI శ్రీకాంత్ శనివారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. వినాయక్ నగర్‌కు చెందిన మల్లెపూల సందీప్ కుమార్(36) వ్యాపారంలో నష్టాలకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News July 6, 2025
పొతంగల్: అబార్షన్ అయ్యిందని వివాహిత ఆత్మహత్య

అబార్షన్ అయ్యిందని మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పొతంగల్ మండలం కొడిచర్లలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొడిచర్ల సుధాకర్‌తో మహాదేవి(28)కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె ఇటీవల గర్భం దాల్చగా పిండం సరిగా లేక అబార్షన్ అయ్యంది. దీంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News July 6, 2025
NZB: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలి

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.