News December 4, 2024
NZB: మెప్మా మహిళా సంఘాలకు భారీగా రుణాలు పంపిణీ
నిజామాబాద్ నగర పాలక సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం అర్బన్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. 128 స్వయం సహాయక సంఘాలకు రూ. 10.52 కోట్ల విలువ చేసే చెక్కులు అందజేశారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 32 మంది సభ్యులకు కోటి రూపాయల చెక్కు పంపిణీ చేశారు. వీధి విక్రయదారులకు స్వనిధి పథకం కింద 50 మందికి రూ. 15 లక్షల ఆర్థిక తోడ్పాటు అందించారు.
Similar News
News January 17, 2025
NZB: గాలిపటం కోసం యత్నించిన బాలుడికి షాక్
విద్యుత్ వైర్లపై ఉన్న గాలిపటాన్ని తీసేందుకు యత్నించిన బాలుడు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. నిజామాబాద్ వినాయక్ నగర్‌లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కాలనీకి చెందిన షేక్ జిశాంత్ బంగ్లాపై ఆడుకుంటూ ఉండగా విద్యుత్ వైర్లకు గాలిపటం ఉండటంతో దాన్ని తీసే క్రమంలో సర్వీస్ వైర్లు తగిలి షాక్‌కు గురయ్యాడు. 50% కాలిన గాయలతో బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ దర్యాప్తు చేపట్టారు.
News January 17, 2025
లింగంపేట్: యాక్సిడెంట్‌లో యువకుడి మృతి.. గ్రామస్థుల ధర్నా
లింగంపేట మండలం ముస్తాపూర్ తండాలో గ్రామానికి చెందిన మోహన్ అనే యువకుడు గురువారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో అతను మృతి చెందాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో అతను మృతి చెందాడని కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై గ్రామస్థులు శుక్రవారం ధర్నా చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది.
News January 17, 2025
NZB: కేసీఆర్ కృషి ఫలించింది: MLC కవిత
బీడుబడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని KCR చేసిన కృషి ఫలించిందని MLC కవిత ‘X’ వేదికగా పేర్కొన్నారు. కృష్ణా నీళ్లలో మా వాటా మాకే అని కేసీఆర్ చేసిన పోరాట ఫలాలు అందుకోవడం ఎంతో దూరంలో లేదు. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరపాలని గత పదేళ్లుగా KCR చేసిన వాదనకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొగ్గు చూపడం సంతోషకరమని అన్నారు. ‘ఇది BRS, తెలంగాణ ప్రజల విజయం.. అంటూ’ కవిత ట్వీట్ చేశారు.