News December 22, 2024

NZB: మెరుగైన విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించడమే ధ్యేయం: మంత్రి

image

ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఆదివారం రెంజల్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం, సామాజిక భద్రతను ప్రజలకు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంలో ముందుకెళ్తున్నామన్నారు.

Similar News

News February 26, 2026

BREAKING: నిజామాబాద్ అదనపు కలెక్టర్ బదిలీ

image

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న అంకిత్ (2019 బ్యాచ్) కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ CS రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అంకిత్‌ను భద్రాద్రి కొత్త గూడెం కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్‌ను TGSPDCL ఛైర్మన్&MDగా బదిలీ చేశారు.

News February 26, 2026

NZB: 40 పాఠశాలలకు పీఎం శ్రీ నిధులు: కలెక్టర్

image

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌తో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలో 40 పాఠశాలలకు పీఎం శ్రీ పథకం కింద నిధులను మంజూరయ్యాయని తెలిపారు.

News February 26, 2026

NZB: 40 పాఠశాలలకు పీఎం శ్రీ నిధులు: కలెక్టర్

image

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 40 పాఠశాలలకు పీఎం శ్రీ పథకం కింద నిధులను మంజూరయ్యాయన్నారు.