News January 26, 2025
NZB: మొదటి బహుమతి సాధించిన షేక్ అమీనా

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని షేక్ అమీనా మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం షేక్ అమీనాకు కలెక్టర్ ప్రశంసాపత్రం తో పాటు మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా వారిని DIEO రవికుమార్ అభినందించారు.
Similar News
News October 29, 2025
NZB: పతకాలు గుర్తింపు కాదు.. నిబద్ధతకు ప్రతీక CP

పతకాలు సిబ్బందికి గుర్తింపు మాత్రమే కాదని, వారి సేవా స్ఫూర్తికి, కష్టపడి పని చేసే నిబద్ధతకు ప్రతీక అని నిజామాబాద్ CP సాయి చైతన్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 95 మందికి వచ్చిన వివిధ రకాల సేవా పతకాలను మంగళవారం ఆయన సీపీ కార్యాలయంలో ప్రదానం చేసి మాట్లాడారు. ప్రజల, శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది చూపుతున్న సేవా మనోభావం ప్రశంసనీయమైనదని ప్రశంసించారు.
News October 29, 2025
బోధన్, ఆర్మూర్ పట్టణాలకు మాస్టర్ ప్లాన్

అమృత్ 2.0లో భాగంగా జిల్లాలోని బోధన్, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాలలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో మొదటి కన్సల్టేటివ్ వర్క్షాప్ నిర్వహించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగుపరుస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు మాస్టర్ ప్లాన్ దోహదపడుతుందని కలెక్టర్ వెల్లడించారు. అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు.
News October 28, 2025
CM రేవంత్, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు: MPఅర్వింద్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని MP అర్వింద్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..CM రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు కాబట్టే ఆమె రాజీనామా ఆమోదం పొందడం లేదని ఆరోపించారు. స్వయంగా కవితనే రాజీనామా పత్రాన్ని అందజేస్తే ఆమోదించని అసమర్ధ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు.


