News March 24, 2025
NZB: యథావిధిగా పాఠశాలలు

ఈ నెల 25న అన్ని పాఠశాలలు యథావిధిగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని డీఈఓ అశోక్ తెలిపారు. పదో తరగతి పరీక్షల దృష్ట్యా ఎగ్జామ్ సెంటర్లు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం నుంచి నిర్వహిస్తుండగా 25న ఎస్ఎస్సీ పరీక్ష లేకపోవడంతో ఈ సవరణ చేసినట్లు తెలిపారు. అదే విధంగా పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్ విధులు నిర్వర్తిస్తున్న వారు యథావిధిగా తమ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు.
Similar News
News December 4, 2025
NZB: మరోసారి అవకాశం కల్పిస్తా ఈ సారికి ఆగు..!

పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత, రెండవ విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా మూడో విడత కొనసాగుతోంది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడంతో ఒకే వర్గానికి చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో ఒకరినొకరు బుజ్జగిస్తున్నారు. నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. మరోసారి నీకు అవకాశం కల్పిస్తా ఈసారికి ఆగు అన్నట్లు మాట్లాడుతున్నారు.
News December 4, 2025
నిజామాబాద్: 27 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవం

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ బుధవారంతో ముగియగా జిల్లాలో 27 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. వర్ని మండలంలో 10, బోధన్ మండలంలో 4, సాలూర మండలంలో 3, కోటగిరి మండలంలో 5, చందూరు మండలంలో 2, పోతంగల్, ఎడపల్లి, నవీపేట్ మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.
News December 4, 2025
మాక్లూర్: ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్ప గ్రామంలో కూలీ పనులకు వచ్చిన బీహార్కు చెందిన సంతోష్ కుమార్ (25) సోమవారం రాత్రి భోజనం వద్ద గుడ్డు కుమార్తో ఘర్షణ పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సంతోష్ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. గుడ్డు కుమార్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.


