News March 16, 2025
NZB: యాక్సిడెంట్.. బోల్తా పడ్డ కారు

నిజామాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జీజీ కాలేజీ సమీపంలో బైపాస్పై ఓ బాలుడు సైకిల్ మీద వచ్చాడు. సైకిల్ను తప్పించే ప్రయత్నంలో బాలుడిని కారు ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. సైకిల్ పై ఉన్న బాలుడితో సహ కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 16, 2025
NZB: బాలుడి విక్రయం కలకలం.. తల్లితో సహా ముగ్గురి అరెస్ట్

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో 2 నెలల బాలుడి విక్రయం కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన వారికి రూ.2.40 లక్షలకు కన్న బిడ్డను తల్లి లక్ష్మీ హైదరాబాద్లో అమ్మగా పోలీసులకు బాలుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లితో సహా విఠల్, రమాదేవి అనే ముగ్గురిని 4వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News December 16, 2025
NZB: తుది దశ ఎన్నికలకు రంగం సిద్ధం

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్ కు అధికారులు రంగం సిద్ధం చేశారు. మూడో విడుత పోలింగ్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లో కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జర గనుంది. తుది విడుత పోలింగ్లో ఉన్న మొత్తం సర్పంచ్ స్థానాలు 165 కాగా ఇందులో 19 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు.
News December 15, 2025
NZB: ముగిసిన 3వ విడత ఎన్నికల ప్రచార పర్వం

నిజామాబాద్ జిల్లాలో 3వ విడతలో 12 మండలాల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం
సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మూడో విడతలో ఆర్మూర్ డివిజన్లోని ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలో గల గ్రామాలలో బుధవారం పోలింగ్ జరుగనుంది


