News December 31, 2024

NZB: యువకుడిపై అత్యాచారం కేసు నమోదు

image

సాయం చేస్తానని నమ్మించి తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు ఓ మహిళ NZB 1 టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. SHO రఘుపతి వివరాల ప్రకారం.. భర్తతో గొడవ పడి నిర్మల్‌కు వెళ్లిన మహిళను గౌతమ్ ఈ నెల 17న NZBకి తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కాగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు SHO వెల్లడించారు.

Similar News

News November 19, 2025

అంకిత భావంతో కృషి చేయాలి: NZB కలెక్టర్

image

10వ తరగతి ఫలితాలు మరింత మెరుగుపడేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి MEOలు, కాంప్లెక్స్ HMలకు సూచించారు. ఒక్కో కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల వారీగా నిర్వహణ తీరు, ఆయా బడుల స్థితిగతులు, బోధన తీరు, సదుపాయాల కల్పన తదితర అంశాలపై కలెక్టర్ MEOలు, కాంప్లెక్స్HMలతో చర్చించారు. వారికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

News November 19, 2025

NZB: వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి: DMHO

image

NZB జిల్లాలోని PHCలు, సబ్ సెంటర్లలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (DMHO) డా.రాజశ్రీ ఆదేశించారు. అవుట్ పేషెంట్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. గర్భిణుల వివరాల నమోదులో అలసత్వం వహించే ANMలు, ఆశా కార్యకర్తలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు.

News November 19, 2025

నిజామాబాద్: 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా

image

నిజామాబాద్‌ డివిజన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 30 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని మంగళవారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారిలో 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మరో ఏడుగురికి జైలు శిక్ష పడింది. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.