News March 30, 2025
NZB: యువకుడి ఆత్మహత్యాయత్నం

బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం ఆకుల కొండూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆకాశ్ ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు పాల్పడి సుమారు రూ.3 లక్షల వరకు నష్టపోయాడు. దీంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు NZBలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు చికిత్స పొందుతున్నాడు.
Similar News
News February 28, 2026
NZB: విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం: కలెక్టర్

విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా పంపిణీ చేపట్టగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్జనను కొనసాగించాలని హితవు పలికారు.
News February 28, 2026
నవీపేట్: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.