News February 8, 2025

NZB: యువకుడి ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రాం

image

ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన గొడవ కారణంగా యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన మోపాల్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కంజర గ్రామానికి చెందిన విశాల్(19) మరో ఇద్దరు స్నేహితుల మధ్య ఇంస్టాగ్రామ్ విషయంలో గొడవ జరిగింది. దీంతో విశాల్ గత నెల 16న పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

Similar News

News March 22, 2025

నిజామాబాద్: ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

లేఔట్ల క్రమబద్దీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ 25 శాతం రాయితీ అవకాశాన్ని నిర్ణీత గడువులోగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఎల్ఆర్ఎస్ సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. ఎఫ్‌టీఎల్, నిషేధించిన సర్వే నంబర్లు మినహా దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించిందని కలెక్టర్ సూచించారు

News March 22, 2025

NZB: తపాలా వివాదాల పరిష్కారానికి డాక్ అదాలత్

image

నిజామాబాద్ తపాలా విభాగంలో వివాదాల పరిష్కారానికి మార్చి 25న 49వ డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సూపరింటెండెంట్ జనార్ధన్ తెలిపారు. పోస్టల్ విభాగంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న మనీ ఆర్డర్, స్పీడ్ పోస్ట్, బీమా, ఆర్‌డీ పథకాలు తదితర సమస్యలు సంబంధిత అధికారులు పరిష్కారిస్తారని వివరించారు. ఈ కార్యక్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News March 21, 2025

NZB: చోరీకి పాల్పడిన మహిళలకు దేహశుద్ధి

image

ఇంట్లో ఎవరూలేని సమయంలో చోరీకి పాల్పడిన ముగ్గురు మహిళలను గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఠాణాకలాన్‌లో చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన గిర్మారెడ్డి అనే వ్యక్తి ప్రస్తుతం NZBలో నివాసముంటున్నాడు. గత 9 నెలలుగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గమనించిన బెంగి గంగామణి, ఎరుకల శ్యామల, సునీతలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో చోరి చేస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు.

error: Content is protected !!