News February 23, 2025
NZB: యువతిపై సామూహిక అత్యాచారం

ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఓ యువతిపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. బాధితురాలితో ఉన్న మరో యువతి ఘటనాస్థలి నుంచి పారిపోయి గ్రామస్థులకు విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువతులను NZB నుంచి కారులో తెచ్చారని, మద్యం మత్తులో ఉన్నారని సమాచారం.
Similar News
News November 26, 2025
త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు గడువు పెంపు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. త్రీ వీలర్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
News November 26, 2025
దివ్యాంగులకు ఎల్లుండి ఆటల పోటీలు

నవంబర్ 28న జిల్లా దివ్యాంగులకు ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 54 ఏళ్ల మధ్య దివ్యాంగులకు పరుగు పందెం, షాట్పుట్, చెస్, జావెలిన్ త్రో, క్యారమ్స్ వంటి విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు కలెక్టర్ కార్యాలయ సముదాయం గ్రౌండ్లో ప్రారంభమయ్యే ఈ పోటీల్లో ఆసక్తిగల దివ్యాంగులు పాల్గొని ప్రోగ్రాంను విజయవంతం చేయాలన్నారు.
News November 26, 2025
సీతంపేటలో కేంద్ర నోడల్ అధికారి పర్యటన

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ సీతంపేటకు విచ్చేశారు. ఆశావాహ జిల్లా, బ్లాక్స్ ప్రోగ్రాంకు జిల్లా కేంద్ర నోడల్ అధికారిగా సీతంపేటకు విచ్చేసిన ఆమెకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి, జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ స్వాగతం పలికారు. కలెక్టర్ జిల్లాలో గిరిజన సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను ఆమెకు సంక్షిప్తంగా వివరించారు.


