News August 30, 2024

NZB: ‘రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తోంది’

image

రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తోందని జుక్కల్ MLA తోట లక్ష్మి కాంత్ రావు కితాబు ఇచ్చారు. ఆయన గురువారం ఓ మీడియా ఛానల్‌తో డిబేట్ పాల్గొన్నారు. ‘గత పదేళ్లుగా లంచాలు తీసుకొని BRS నేతలు అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహించారని అన్నారు. పదేళ్లలో చెరువులను పరిరక్షించే పనులు BRS ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆక్రమణలు చేసిన నేతలు ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ వారిని వదిలి పెట్టదని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News September 19, 2024

NZB: ‘పండుగ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’

image

NZB కమిషనరేట్ ఆర్మూరు, బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సీపీ కల్మేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. గణేష్ నిమజ్జన వేడుకలకు పోలీసు శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు సైతం చేసిందని దీనికి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. అన్ని మతాల పెద్దలు స్వచ్చందంగా సహకరించారని వెల్లడించారు.

News September 19, 2024

NZB: డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నిఖత్ జరీన్

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీగా బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిఖత్ బుధవారం డీజీపీ జితేందర్‌ను కలిసి తన జాయినింగ్ ఆర్డర్ అందజేశారు.

News September 19, 2024

NZB: పాము కాటేస్తోంది.. జర భద్రం..!

image

వర్షాకాలం ఉండడంతో పాముల సంచారం అధికమైంది. పాము కాటుకు గురై.. మృతి చెందుతున్న ఘటనలు నిజామాబాద్ జిల్లాలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. గడ్డి పొదలు, పొలం గట్లను స్థావరం చేసుకుని ఉన్న పాములు రైతులను కాటేస్తున్నాయి. ఎక్కువ శాతంమంది నాటువైద్యంపై ఆధారపడి.. ప్రాణాలు కాపాడే విలువైన సమయాన్ని చేజేతులా జారవిడుస్తున్నారు. వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదన్న అపవాదు ఉంది.