News October 24, 2024

NZB: రాష్ట్రస్థాయి పోటీలకు పొతంగల్ విద్యార్థులు

image

రాష్ట్రస్థాయిలో జరిగే కబడ్డీ పోటీలకు పొతంగల్ కలాన్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు భావన, అక్షయ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగారావు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి వచ్చే నెల 3వ తేదీ నుంచి 5 వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డ పోటీల్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజ్ తెలిపారు.

Similar News

News December 4, 2025

NZB: 3వ విడత తొలిరోజు 579 నామినేషన్లు

image

నిజామాబాద్ జిల్లాలో 3వ విడత GP ఎన్నికల్లో భాగంగా తొలిరోజు బుధవారం 579 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాల కోసం 174 మంది, 1,620 వార్డు మెంబర్ స్థానాలకు 405 మంది నామినేషన్లు వేశారు.

News December 3, 2025

NZB: రూ.17 లక్షల విలువైన ఫోన్లు రికవరీ

image

NZB పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ పోలీస్ సబ్ డివిజన్‌కు సంబంధించి 170 మంది బాధితులు ఫోన్లు పోగొట్టుకున్నరు. రూ.17 లక్షల విలువైన ఫోన్లను బాధితులకు ACP రాజా వెంకటరెడ్డి అందజేశారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ (https://www.ceir.gov.in)లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.

News December 3, 2025

NZB: స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్లను పరిశీలించిన అబ్జర్వర్

image

నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC) సెల్‌ను జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ బుధవారం పరిశీలించారు. ఎన్నికల అంశాలకు సంబంధించి ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటిపై చేపట్టిన చర్యల గురించి ఆరా తీశారు. మానిటరింగ్ సెల్‌ను తనిఖీ చేశారు. నిఘా బృందాల పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.