News April 14, 2025
NZB: రిటైర్డ్ పోలీసుల నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఎం.నాగేందర్, ప్రధాన కార్యదర్శిగా లింగన్న, కోశాధికారిగా టి.నారాయణతో పాటు గౌరవ అధ్యక్షులుగా 4, ఉపాధ్యక్షులుగా 3, సంయుక్త కార్యదర్శులుగా 4, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా 4, ఈసీ సభ్యులుగా 8, సలహదారులుగా 12 మందిని నియమించారు. న్యాయ సలహాదారుగా Rtd DSP మనోహర్‌ను ఎన్నుకున్నారు.
Similar News
News November 18, 2025
నిజామాబాద్: చలికాలం.. CP జాగ్రత్తలు..!

చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వాహనదారులు పొగమంచు పడుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిజమాబాద్ సీపీ సాయి చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వాహనదారులు తక్కువ వేగం, హై బీమ్ లైట్ కాకుండా లో బీమ్ లైట్లు, రేడియం స్టిక్కర్స్ తదితర నిబంధనలు పాటించాలన్నారు. రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా జాగ్రతలు పాటించాలని ఆయన కోరారు.

స్థానిక పోరుపై ప్రకటన.. ఆశావహుల్లో మళ్లీ ఆశలు..!

సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో జిల్లాలోని పల్లెల్లోని ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముందు గ్రామపంచాయితీ ఎన్నికలు ఉంటాయనడంతో తమ ప్యానెల్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నం అయ్యారు. జూబ్లీహిల్స్‌లో అధికార పార్టీ గెలవడంతో అదే జోష్‌లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తుందని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.