News May 11, 2024

NZB: రూ. 3.05 కోట్ల నగదు.. రూ. 24.64 లక్షల మద్యం పట్టివేత: CP

image

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో రూ.3.05 కోట్ల నగదు, రూ.24.64 లక్షల విలువ చేసే మద్యం, రూ. 3.65 లక్షల విలువ చేసే 14 కిలోల గంజాయి, రూ.29 లక్షల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 126 లైసెన్సు కలిగిన తుపాకులు ఉండగా, వాటిలో 91 తుపాకులను డిపాజిట్ చేశారన్నారు.

Similar News

News November 6, 2025

ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలి: NZB కలెక్టర్

image

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గురువారం విద్యా శాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపల్స్, HMలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రయోజనార్థం ప్రభుత్వం వారి వివరాలను యూడైస్‌లో నిక్షిప్తం చేయిస్తోందన్నారు.

News November 6, 2025

రేపు ‘వందేమాతరం’ సామూహిక గీతాలాపన: NZB కలెక్టర్

image

వందేమాతరం జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని శుక్రవారం సామూహిక గీతాలాపన ఉంటుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. వందేమాతరం గీతానికి గల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు వీలుగా చేపడుతున్న వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని విధిగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆలపించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News November 6, 2025

ఇజ్రాయెల్‌లో JOBS.. రేపు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు

image

ఇజ్రాయెల్ దేశంలో సెరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్ వర్క్, బ్లాక్ బిల్డర్స్(మేసన్స్), జిప్సం వర్క్, ఉద్యోగాల కోసం రేపు నిజామాబాదులో ఎన్రోల్మెంట్, అవగాహనా డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. 21 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండి, 10వ తరగతి పాసైనవారు ఇందులో పాల్గొనేందుకు అర్హులు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు కోరారు. VENUE- జిల్లా ఉపాధి కార్యాలయం నిజామాబాద్. CONTACT- 9959456793.