News January 19, 2025
NZB: రూ.382.28 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

నిజామాబాద్ నగరంలో రూ.382.28 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ తాగునీటి సమస్యను తీర్చడానికి అమృత పథకం రూ.217 కోట్లతో నీటి సరఫరా, భూగర్భ మురుగునీటి నిర్వహణకు రూ.162.81 కోట్లు, రూ.2.47 కోట్లతో నిర్మించనున్న స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణం కోసం ఆయన శంకుస్థాపన చేశారు.
Similar News
News October 28, 2025
CM రేవంత్, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు: MPఅర్వింద్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని MP అర్వింద్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..CM రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు కాబట్టే ఆమె రాజీనామా ఆమోదం పొందడం లేదని ఆరోపించారు. స్వయంగా కవితనే రాజీనామా పత్రాన్ని అందజేస్తే ఆమోదించని అసమర్ధ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు.
News October 28, 2025
NZB: అయ్యో.. రూ. 3 లక్షలు పోయాయ్..!

ఎన్నో ఆశలు, మరెన్నో ఉత్కంఠల మధ్య నిజామాబాద్ జిల్లాలో వైన్ షాపుల కేటాయింపునకు సంబంధించిన లక్కీ డ్రా సోమవారం పూర్తయింది. డ్రా ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించారు. విజేతలుగా నిలిచిన అదృష్టవంతుల మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. లక్కీ డ్రాలో తమ పేర్లు రాని వారి మొహాలు చిన్నబోయాయి. డబ్బులు పోయిన బాధతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకుంటే డ్రాలో పేరు రాలేదని నైరాశ్యంలో మునిగారు.
News October 28, 2025
NZB: DCC పీఠం దక్కేదెవరికో..?

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ భరితంగా మారింది. ఈ పదవి కోసం 17 మంది అధ్యక్ష పీఠం కోసం పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో NZBకు చెందిన నరాల రత్నాకర్, నగేష్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, జావేద్ అక్రమ్, బాడ్సి శేఖర్ గౌడ్ తదితరులతో పాటు ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాల వారు దరఖాస్తు చేశారు. ఇందులో వారికి పదవి అప్పగిస్తారనేది ఉత్కంఠ భరితంగా మారింది.


