News January 19, 2025
NZB: రూ.382.28 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

నిజామాబాద్ నగరంలో రూ.382.28 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ తాగునీటి సమస్యను తీర్చడానికి అమృత పథకం రూ.217 కోట్లతో నీటి సరఫరా, భూగర్భ మురుగునీటి నిర్వహణకు రూ.162.81 కోట్లు, రూ.2.47 కోట్లతో నిర్మించనున్న స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణం కోసం ఆయన శంకుస్థాపన చేశారు.
Similar News
News February 11, 2025
భీమ్‌గల్: Way2News కథనానికి స్పందన

Way2Newsలో సోమవారం ప్రచురితమైన ‘నాలుగు నెలలుగా నీటి సరఫరా లేదు’ కథనానికి మండల అధికారులు స్పందించారు. ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎంపీఓ జావేద్ అలీ భీమ్‌గల్ మండలం సాలింపూర్ గ్రామాన్ని సందర్శించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాడైపోయిన పైపులు, మోటార్లను మరమ్మతు చేయించి గ్రామస్థులకు నీరందిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
News February 11, 2025
నిజామాబాద్: నిర్యుదోగ మహిళలకు ఉచిత శిక్షణ

SC కార్పొరేషన్ ద్వారా SC నిర్యుదోగ మహిళలకు న్యాక్ నిజామాబాద్ ఆధ్వర్యంలో టైలరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ జె.లింబద్రీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీ టవర్స్ పక్కన ఉన్న శిక్షణ కేంద్రంలో ఫిబ్రవరి 12లోపు సంప్రదించలని కోరారు. శిక్షణ అనంతరం సర్టిఫికేట్ తో పాటు కుట్టు మిషన్ ఉచ్చితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.
News February 11, 2025
FLASH: నిజామాబాద్ జిల్లా పరిషత్ CEOగా సాయాగౌడ్

నిజామాబాద్ జిల్లా పరిషత్ CEOగా డి.సాయాగౌడ్ ను నియమిస్తూ పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం సాయగౌడ్ నిజామాబాద్ జిల్లాలో డీఆర్డీఏ PDగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆస్థానం నుంచి బదిలీ చేసి CEOగా నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖాళీగా ఉన్న CEO పోస్టులను భర్తీ చేశారు.