News September 3, 2024

NZB: రూ.825కే విద్యుత్ మీటర్

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ మీటర్లు లేని BPL కుటుంబాలకు NPDCL రూ.825కే విద్యుత్ కనెక్షన్ ఇవ్వనుంది. ఈ నెల 15 వరకు నేరుగా విద్యుత్ అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 500 వాట్ల విద్యుత్ వాడే వారు విద్యుత్ కార్యాలయాలు, ఉపకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు. దరఖాస్తు ఫీజు – రూ.25, డెవలప్‌మెంట్ ఛార్జీ – రూ.600, సెక్యూరిటీ డిపాజిట్ – రూ.200 కలిపి మొత్తంగా రూ.825వసూలు చేయనున్నారు.

Similar News

News October 28, 2025

NZB: అయ్యో.. రూ. 3 లక్షలు పోయాయ్..!

image

ఎన్నో ఆశలు, మరెన్నో ఉత్కంఠల మధ్య నిజామాబాద్ జిల్లాలో వైన్ షాపుల కేటాయింపునకు సంబంధించిన లక్కీ డ్రా సోమవారం పూర్తయింది. డ్రా ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించారు. విజేతలుగా నిలిచిన అదృష్టవంతుల మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. లక్కీ డ్రాలో తమ పేర్లు రాని వారి మొహాలు చిన్నబోయాయి. డబ్బులు పోయిన బాధతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకుంటే డ్రాలో పేరు రాలేదని నైరాశ్యంలో మునిగారు.

News October 28, 2025

NZB: DCC పీఠం దక్కేదెవరికో..?

image

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ భరితంగా మారింది. ఈ పదవి కోసం 17 మంది అధ్యక్ష పీఠం కోసం పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో NZBకు చెందిన నరాల రత్నాకర్, నగేష్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, జావేద్ అక్రమ్, బాడ్సి శేఖర్ గౌడ్ తదితరులతో పాటు ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాల వారు దరఖాస్తు చేశారు. ఇందులో వారికి పదవి అప్పగిస్తారనేది ఉత్కంఠ భరితంగా మారింది.

News October 28, 2025

NZB: నగరంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

నిజామాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి సోమవారం తెలిపారు. బస్టాండ్ ప్రాంతంలోని ఓ హోటల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి కింద పడి ఉండగా స్థానికులు, పోలీసుల సహకారంతో 108 ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు సదురు వ్యక్తిని పరిశీలించి మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మృతుడు వయసు 50 నుంచి 55 సంవత్సరాల వరకు ఉండొచ్చని అంచనా వేశారు.