News September 3, 2024
NZB: రూ.825కే విద్యుత్ మీటర్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విద్యుత్ మీటర్లు లేని BPL కుటుంబాలకు NPDCL రూ.825కే విద్యుత్ కనెక్షన్ ఇవ్వనుంది. ఈ నెల 15 వరకు నేరుగా విద్యుత్ అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 500 వాట్ల విద్యుత్ వాడే వారు విద్యుత్ కార్యాలయాలు, ఉపకేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు. దరఖాస్తు ఫీజు – రూ.25, డెవలప్‌మెంట్ ఛార్జీ – రూ.600, సెక్యూరిటీ డిపాజిట్ – రూ.200 కలిపి మొత్తంగా రూ.825వసూలు చేయనున్నారు.
Similar News
News September 16, 2024
‘గాంధీ భవన్‌తో 40ఏళ్ల అనుభవం ఉంది’
గాంధీభవన్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని నూతన TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్‌లో 1985లో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా తన ప్రస్థానం ప్రారంభమైందని తెలిపారు. కౌశిక్‌రెడ్డి వాడిన భాష వల్లే అరెకపూడి గాంధీ అనుచరులు నొచ్చుకున్నారని, బూతులు తిట్టుకోవడం TG రాజకీయాల్లో గతంలో లేదని ఆయన పేర్కొన్నారు. పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని తనకు పదవితో నిరూపితమైందని వెల్లడించారు.
News September 15, 2024
NZB: తాళం వేసిన ఇంట్లో చోరీ
నిజామాబాద్ నగరంలోని బాబన్ సాహబ్ పహాడ్ లో తాళం వేసి ఇంట్లో చోరీ జరిగింది. బాబన్ సాహబ్ పహాడ్‌కుచెందిన షేక్ అబ్బుత్ ఆలిక్ శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న ఉన్న 2 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు అపహరించుకుపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు 5వ టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు.
News September 15, 2024
రుద్రూర్: గణనాథునికి 108 రకాల నైవేద్యాలు
రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ నవయుగ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకునికి భక్తులు ఆదివారం 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. లడ్డూలు, గారెలు, చెకోడీలు, అరిసెలు, బొబ్బట్లు, పండ్లు ,పాయసం, పులిహోర, స్వీట్లు ఇతర రకాల నైవేద్యాలను భక్తులు తయారుచేసి గణనాథునికి నైవేద్యంగా సమర్పించారు. ఉదయం కుంకుమార్చన నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.