News May 3, 2024
NZB: రెండు నియోజకవర్గాలు.. 3768 పోలింగ్ బూత్లు

నిజామాబాద్ MP స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. జహీరాబాద్ MPస్థానంలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. నిజామాబాద్ పరిధిలో నిజామాబాద్ రూరల్ 293, నిజామాబాద్ అర్బన్ 289, జగిత్యాల 254, కోరుట్ల 252, బాల్కొండ 246, బోధన్ 246, ఆర్మూర్ 217 బూత్లు ఉన్నాయి. జహీరాబాద్ పరిధిలో జహీరాబాద్ 313, అందోల్ 313, నారాయణఖేడ్ 296, ఎల్లారెడ్డి 270, కామారెడ్డి 266, బాన్సువాడ 258, జుక్కల్ 255 బూత్లు ఉన్నాయి.
Similar News
News October 23, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో NZB క్రీడాకారులకు మెడల్స్

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన అండర్ 19 రెజ్లింగ్ పోటీల్లో NZB క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2 గోల్డ్ మెడల్స్ 3 రజత పథకాలు సాధించారని కోచ్ సంతోష్ తెలిపారు. సఫీయా 76kg విభాగంలో కృష్ణ 65KG విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారన్నారు. మెడల్స్ సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.
News October 23, 2025
NZB: దివ్యాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి

దివ్యాంగ విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ అధికారిణి రసూల్ బీ తెలిపారు. 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రీ మెట్రిక్, ఇంటర్ లేదా ఆపై చదువుతున్న వారికి పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ జాతీయ స్థాయిలో మంజూరు చేస్తామన్నారు. ఇందుకోసం www.scholarships.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News October 23, 2025
NZB: వైన్స్ దరఖాస్తులకు నేడే లాస్ట్

మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియనుందని నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిన్నటి వరకు జిల్లా వ్యాప్తంగా 102 మద్యం షాపులకు 2,658 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. కాగా ఈ నెల 27న భారతి గార్డెన్లో మద్యం దుకాణాల కేటాయింపు కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నారు.