News April 2, 2025
NZB: రేషన్ షాపులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో పలు రేషన్ దుకాణాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో లబ్ధిదారులకు సజావుగా బియ్యం పంపిణీ చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో బియ్యం పంపిణీ జరిగింది, ఇంకా ఎంత మందికి పంపిణీ చేయాల్సి ఉంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News April 5, 2025
NZB: కత్తి దాడి.. ముగ్గురి అరెస్ట్

నిజామాబాద్ నగరంలోని ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కేసులో ముగ్గురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సౌత్ రూరల్ సీఐ సురేశ్ తెలిపారు. నగరంలోని ఆరో టౌన్ పరిధిలో అక్బర్ కాలనీ కెనాల్ కట్టలో ఇటీవల కత్తి పోట్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన ఆరిఫ్ ఖాన్, సోహెల్ ఖాన్, షేక్ పర్వేజ్లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ వివరించారు.
News April 5, 2025
NZB: ప్రకృతి విధ్వంసంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆవేదన

గచ్చిబౌలి భూముల్లో ప్రకృతి విధ్వంసంపై బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నెమళ్లు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని లేళ్లకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని, చెట్లను నరికేసే ప్రకృతితో యుద్ధం చేస్తూ పర్యావరణ హననానికి పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అడవులు 7.7 శాతం పెరిగాయని, ఇప్పుడు రాష్ట్రంలో చెట్లను నరికేసిన పరిపాలన సాగుతున్నదన్నారు.
News April 5, 2025
NZB: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 7వ స్నాతకోత్సవం

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ మెడికల్ కాలేజీలో శుక్రవారం రాత్రి 7వ స్నాతకోత్సవం నిర్వహించారు. విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ముఖ్య అతిథిగా గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా హాజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపతిరావు, GGH సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.