News November 22, 2024
NZB: రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ: కలెక్టర్

సన్న వడ్లకు రూ.500 చొప్పున బోనస్ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. శుక్రవారం ఆయన రైతులతో మాట్లాడారు. నిర్ణీత గడువులోపు రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరుపుతున్నామన్నారు. ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా అందరి సహకారంతో జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తున్నామని వివరించారు.
Similar News
News January 8, 2026
NZB: మున్సిపల్ రిజర్వేషన్లపై ఆశావాహుల ఉత్కంఠత

జిల్లాలోని NZB మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీలలో రిజర్వేషన్లపై పోటీ చేసేందుకు సిద్ధమైన ఆశావహుల్లో ఉత్కంఠత నెలకొంది. చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్ సీట్లు ఏ కేటగిరికి రిజర్వు అవుతాయోనని ఆశావహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. దామాషా పద్ధతిలో మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వు అవుతుండగా మిగిలిన స్థానాలు ఏ కేటగిరికి రిజర్వ్ అవుతుందోనని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.
News January 8, 2026
హరియాణాలో కామారెడ్డి వాసి దారుణ హత్య

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన కటికే రజనీకాంత్ (40) హరియాణాలో కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఉపాధి నిమిత్తం వెళ్లిన అతడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పోలీసుల సహకారంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు హరియాణాకు వెళ్లారు.
News January 8, 2026
NZB: ఎజెండా కమిటీ సభ్యులతో కవిత జూమ్ కాన్ఫరెన్స్

తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి రూపొందించబోయే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్న ఎజెండా కమిటీ సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం-సంపూర్ణ అధ్యయనం’ సహా 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వీరు తమ నివేదికలను ఈనెల 17న జాగృతి స్టీరింగ్ కమిటీకి నివేదికలు అందజేయాలని సూచించారు.


