News January 24, 2025
NZB: రైలులో పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత

రైలులో ఓ వ్యక్తి పోగొట్టుకున్న బ్యాగును నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి బాధితుడికి అప్పగించారు. గురువారం తిరుపతి నుంచి వచ్చిన రాయలసీమ రైలులో ఓ వ్యక్తి వ్యక్తికి బ్యాగు పోగొట్టుకున్నాడు. దానిలో రూ.16 వేల నగదు, మూడు గ్రాముల బంగారం, ఒక జత బట్టలు ఉన్నాయి. ఇది చూసిన పోలీసులు విచారణ చేపట్టి బ్యాగును గురువారం యజమానికి అప్పగించారు. నిజాయితీని చాటుకున్న పోలీసులకు సదరు వ్యక్తి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 10, 2025
నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ముచ్చట్లు

పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నిన్నటితో తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో తొలి విడతలో 29 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 155 స్థానాలకు 466 మంది పోటీలో నిలిచారు. రెండో దశ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. 19 గ్రామాలు ఏకగ్రీవం కాగా 146 స్థానాలకు 548 మంది బరిలో ఉన్నారు. గుర్తులు కేటాయించడంతో ప్రచార పర్వం మొదలైంది.
News December 10, 2025
NZB: బాబోయ్.. చంపేస్తున్న చలి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మంగళవారం 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మునుముందు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికితోడు పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లండి.
News December 10, 2025
NZB: బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి నిందితులైన బోధన్‌కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా వడ్లూర్కు చెందిన మహమ్మద్ హనీఫ్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 బైక్‌లను స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.


