News January 9, 2025

NZB: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

నిజామాబాద్ నగర శివారులో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌-జాన్కంపేట రైల్వే స్టేషన్ పరిధిలోన బుధవారం సాయంత్రం రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి వివరించారు.

Similar News

News January 16, 2025

NZB: ఓ బిడ్డా.. నిజామాబాద్ మరో 30 ఏళ్లు నీ అడ్డా..!

image

రైతుల దశాబ్దాల కల నెరవేర్చిన MP అర్వింద్‌కు అభినందనలు వెలువెత్తుతున్నాయి. ‘రాజకీయంలో ఎంతో మంది నాయకులను చూశాను కానీ అర్వింద్ లాంటి మొండి పట్టు ఉన్న నాయకుడిని ఇప్పుడే చూస్తున్నాను. పసుపు బోర్డు సాధించిన అర్వింద్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. ఓ బిడ్డా.. నిజామాబాద్ మరో 30 ఏళ్ల నీ అడ్డా..! 68 ఏళ్ల పసుపు రైతు ధన్యవాదములు తెలుపుతున్నట్లు నగరంలో రైతు ఏర్పాటు చేసిన వెలిసిన ఫ్లెక్సీ వైరల్‌గా మారింది.

News January 16, 2025

బాన్సువాడ: అధికారులతో  సబ్ కలెక్టర్ సమీక్ష సమావేశం

image

బాన్సువాడ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సబ్ కలెక్టర్ కిరణ్మయి తహాసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై అధికారులకు అవగాహన కల్పించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News January 16, 2025

NZB: క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరపండి: కలెక్టర్

image

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.