News January 9, 2025
NZB: రైల్వే స్టేషన్ ప్రాంతంలో వృద్ధుడు మృతి

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు SHO రఘుపతి బుధవారం తెలిపారు. రైల్వే స్టేషన్ ఎదురుగా దర్గా వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉండటంతో స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.
Similar News
News October 27, 2025
నిజామాబాద్: మున్సిపల్ కార్మికురాలు మృతి..!

బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మున్సిపల్ కార్మికురాలు <<18115068>>నాగమణినికి తీవ్ర గాయాలయిన<<>> విషయం తెలిసిందే. కాగా, ప్రమాదం జరగగానే స్థానికులు, తోటివారు వెంటనే స్పందించి ఆమెను బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం నాగమణిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానాకు తరలించగా అప్పటికే ప్రాణాలు విడిచింది.
News October 27, 2025
NZB: నేడు ‘లక్కీ’గా వైన్స్లు దక్కేదెవరికి?

మద్యం షాపుల టెండర్లకు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. జిల్లాలోని 102 లిక్కర్ షాపులకు 2,786 దరఖాస్తులు వచ్చాయి. దీనితో జిల్లా ఎక్సైజ్ శాఖకు ఒక్కో టెండర్కు రూ.3 లక్షల చొప్పున రూ83.58కోట్ల ఆదాయం లభించింది. లక్కీ డ్రాలో అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి. అయితే గత టెండర్లలో 3,759 దరఖాస్తులు రాగా.. ఈసారి టెండర్లను రూ.3 లక్షలకు పెంచడంతో దరఖాస్తులు తగ్గాయి.
News October 26, 2025
కాంగ్రెస్ మునిగిపోయే నావ: కవిత

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, వారితో తనకు పని లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారాన్ని కాపాడుకోలేకపోతోందని విమర్శించారు. ఆ పార్టీకి ప్రజల నుంచే దిక్కు లేదని, తనకు మద్దతు తెలుపుతున్నారన్న దాంట్లో వాస్తవం లేదని ఆమె ఎద్దేవా చేశారు.


