News July 13, 2024

NZB: రైస్‌మిల్లులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు

image

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లులో శనివారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ నిఖిల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి సుమారు 80 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు డీటీ వివరించారు.

Similar News

News December 5, 2025

నిజామాబాద్: మండలాల వారీగా నామినేషన్ల వివరాలిలా..!

image

ఆలూరు 11 GPల్లో SP-22, WM-113, ARMR 14 GPల్లో SP -51, WM -146, బాల్కొండ 10GPల్లో SP- 29, WM-108, BMGL27 GPల్లో SP-67, WM-224, డొంకేశ్వర్13 GPల్లో SP-36, WM-98, కమ్మర్‌పల్లి 14GPల్లో SP-35, WM-104, మెండోరా 11GPల్లో SP-34, WM-130, మోర్తాడ్-10 GPల్లో SP-23, WM-117, ముప్కాల్ 7GPల్లో SP-32, WM-97, NDPT22 GPల్లో SP-65, WM-276, వేల్పూర్ 18GPల్లో SP-53, WM-179, ఏర్గట్ల 8GPల్లో SP-22, WM-63 నామినేషన్లు.

News December 5, 2025

నిజామాబాద్: 1,543 నామినేషన్లు

image

నిజామాబాద్ జిల్లాలో 3వ విడత GP ఎన్నికల్లో భాగంగా 2వ రోజైన గురువారం 1,543 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాల కోసం 294 మంది, 1,620వార్డు మెంబర్ స్థానాలకు 1,249 మంది నామినేషన్లు వేశారు.

News December 5, 2025

NZB: ఈ నెల 14 నుంచి ఓపెన్ యునివర్సిటీ పీజీ తరగతులు ప్రారంభం

image

డా.బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యునివర్సిటీ అధ్యయన కేంద్రంలో పీజీ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల14వ తేది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ డా.రామ్మోహన్ రెడ్డి, రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ డా.రంజిత తెలిపారు. విద్యార్థులు తప్పకుండా హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 738 2929612, www.braouonline.inను సందర్శించాలన్నారు.