News November 29, 2024
NZB: రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో రూ.22 కోట్లలతో నిర్మిస్తున్న రోడ్డు పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నల్లవెల్లి-మంగ్యానాయక్ తండా రోడ్డు (రూ.4 కోట్లు), నల్లవెల్లి -గౌరారం రోడ్డు (రూ.18 కోట్ల) పనులను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Similar News
News February 8, 2026
NZB: అర్వింద్ దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తుండు: TPCC

నిజాంబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆదివారం నగరంలోని కోటగల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. దేవుడి పేరు చెప్పి ఓట్లడిగే అర్వింద్‌కు పని చేసే ముఖం ఉందా అని ప్రశ్నించారు.
News February 8, 2026
NZB: కీలకం కానున్న విలీన గ్రామాల ప్రజల ఓట్లు

NZB: కార్పొరేషన్ ఎన్నికల్లో విలీన గ్రామాల ప్రజల ఓట్లు కీలకం కానున్నాయి. గతంలో NZBమున్సిపల్ కార్పొరేషన్లో 50 డివిజన్లుండేవి. కార్పొరేషన్ పరిధిని విస్తరించడానికి NZB చుట్టుపక్కల ఉన్న రూరల్ మండల పరిధిలోని 10 గ్రామాలను 2018లో మున్సిపాలిటీలో విలీనం చేయగా వాటిని 7 (1, 2, 3, 4, 5,13,18) డివిజన్లుగా ఏర్పాటు చేశారు. ఈ డివిజన్లలో ప్రస్తుతం 41,784 ఓట్లు ఉన్నాయి.
News February 8, 2026
NZB: 97 కేసులు.. రూ.9.40 లక్షల జరిమానా: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 97 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 97 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.9.40 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే ముగ్గురికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.


