News August 28, 2024
NZB: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో మాక్లూర్‌కు చెందిన శ్రీకాంత్‌తో పాటు మరో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 15, 2024
రుద్రూర్: గణనాథునికి 108 రకాల నైవేద్యాలు
రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ నవయుగ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకునికి భక్తులు ఆదివారం 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. లడ్డూలు, గారెలు, చెకోడీలు, అరిసెలు, బొబ్బట్లు, పండ్లు ,పాయసం, పులిహోర, స్వీట్లు ఇతర రకాల నైవేద్యాలను భక్తులు తయారుచేసి గణనాథునికి నైవేద్యంగా సమర్పించారు. ఉదయం కుంకుమార్చన నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
News September 15, 2024
వినాయకుడికి పూజలు నిర్వహించిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
కామారెడ్డి: వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పాత జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ దంపతులు శనివారం రాత్రి పట్టణంలోని వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని దయతో వర్షాలు సమృద్ధిగా కురిశాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారిని వినాయక మండప నిర్వాహకులు సన్మానించారు.
News September 15, 2024
NZB: నేటి నుంచి మద్యం అమ్మకాలు బంద్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మకాలను బంద్ చేయాలని పోలీస్ కమిషనర్ సీపీ కల్మేశ్వర్ ఆదేశాలు జారీచేశారు. అలాగే బార్లు, క్లబ్‌లు మూసేయాలన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.