News February 1, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి

నిజామాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్టు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నగరానికి చెందిన మహిపాల్ ఓ ఛానల్‌లో కెమెరామ్యాన్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి ఎడపల్లి మండలం ఠానాకాలన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా జానకంపేట అలీసాగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిపాల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News February 27, 2026
భారత్ ఘన విజయం

T20WC: జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 257 పరుగుల లక్ష్య ఛేదనలో ZIM బ్యాటర్లు 184-6 రన్స్‌కే పరిమితమయ్యారు. బెనెట్(97*) ఒంటరి పోరాటం చేశారు. కెప్టెన్ రజా(31) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, వరుణ్, అక్షర్, దూబే తలో వికెట్ తీశారు. మార్చి 1న వెస్టిండీస్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది.
News February 26, 2026
జిల్లాలో 65,158 మంది వయోజనులకు అక్షరాభ్యాసం- కలెక్టర్

వయోజనులకు అక్షరాభ్యాసం జరిగితేనే రాష్ట్రం, జిల్లా అక్షరాస్యతలో ముందుకు వెళ్తుందని డా.కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో 65,158 మంది వయోజనులకు అక్షరాభ్యాసం చేయడమే లక్ష్యమన్నారు. వయోజనులకు అక్షర జ్ఞానం నేర్పాలన్నారు. మార్చి 15న మొదటి దశలో అక్షరాభ్యాసం పొందిన వారికి చివరి పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లాలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పరీక్షలు సమర్థంగా నిర్వహించాలన్నారు.
News February 26, 2026
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 98.16% హాజరు

కామారెడ్డి జిల్లా కేంద్రం వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 7,878 మంది విద్యార్థులు నమోదు కాగా, అందులో 7,733 మంది హాజరై 145 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా హాజరు శాతం 98.16గా నమోదైంది. పరీక్షా కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.


