News February 15, 2025

NZB: రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది ఇతడే

image

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ జాతీయ రహదారి కారు అదుపుతప్పిన ఘటనలో గంగాధర్ (46) అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతని కూతురు లహరి(20)కి తీవ్రగాయాలయ్యాయి. వీరి స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుక్కునూర్ గ్రామంగా గుర్తించారు. గంగాధర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 27, 2025

NZB: జిల్లాలో తొలి రోజు నామినేషన్లు ఎన్ని అంటే?

image

నిజామాబాద్ జిల్లాలోని బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో మొదటి విడతలో GP ఎన్నికలు జరగనున్నాయి. గురువారం సాయంత్రం వరకు దాఖలైన నామినేషన్లు వివరాలు ఇలా ఉన్నాయి. 184 సర్పంచి స్థానాలకు సంబంధించి 140 నామినేషన్లు, 1,642 వార్డు స్థానాలకు సంబంధించి 96 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు.

News November 27, 2025

NZB: 34 మందికి రూ.3.35 లక్షల జరిమానా

image

నిజామాబాద్‌ కమీషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 34 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని గురువారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారికి రూ.3.35 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

News November 27, 2025

NZB: చట్టబద్ధత దత్తతనే శ్రేయస్కరం: రసూల్ బీ

image

చట్టబద్ధత దత్తత శ్రేయస్కరం అని మహిళా శిశు సంక్షేమ శాఖ NZB జిల్లా సంక్షేమ అధికారిణి ఎస్.కె.రసూల్ బీ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో గురువారం పిల్లల దత్తతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని ఆమె సూచించారు. దివ్యాంగుల పిల్లలను దత్తత తీసుకోవడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.