News February 15, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది ఇతడే

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ జాతీయ రహదారి కారు అదుపుతప్పిన ఘటనలో గంగాధర్ (46) అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతని కూతురు లహరి(20)కి తీవ్రగాయాలయ్యాయి. వీరి స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుక్కునూర్ గ్రామంగా గుర్తించారు. గంగాధర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 28, 2025
NZB: అర్హులందరికీ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం: కలెక్టర్

అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ.20,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) వర్తిస్తుందని అన్నారు. ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణించినట్లయితే, అతని వయస్సు 18 ఏళ్లు పైబడి 60 ఏళ్లలోపు ఉండాలన్నారు.
News March 28, 2025
నిజామాబాద్ జిల్లాలో గంజాయి కలకలం

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గుత్ప గ్రామంలో గంజాయి కలకలం రేపింది. అపురూపాలయం సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కింద శుక్రవారం ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తుండగా స్థానిక విలేకర్లు గ్రామస్థుల సహాయంతో పట్టుకున్నారు. గ్రామంలో విచారించగా వీరు ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిసింది. మాక్లూర్ పోలీస్‌లకు సమాచారం అందించగా నిందితుల నుంచి మూడు ప్యాకెట్ల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు.
News March 28, 2025
NZB: 62 మంది విద్యార్థుల గైర్హాజరు

పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఫిజికల్ సైన్స్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 62 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ వెల్లడించారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 22,904 మంది విద్యార్థులకు అందులో నుంచి 22,842 మంది విద్యార్థులు హాజరయ్యారు. 62 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారికంగా వెల్లడించారు.