News March 12, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో వైద్యుడి దుర్మరణం

నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయుర్వేద వైద్యుడు దుర్మరణం చెందాడు. నందిపేట్ మండలం తల్వేదకు చెందిన చిట్టెం హనుమాండ్లు(54) NZBలో గోల్ హనుమాన్ సమీపంలో ఆయుర్వేద ఆసుపత్రి నిర్వహించేవారు. బైక్‌పై తన దగ్గర పని చేసే శ్రీహరితో కలిసి వెళ్తుండగా పులాంగ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో హనుమాండ్లు మృతి చెందగా శ్రీహరికి గాయాలయ్యాయి.
Similar News
News February 11, 2026
NZB: సర్వం సిద్ధం.. కాసేపట్లో పోలింగ్ ప్రారంభం

నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్, మున్సిపాలిటీలలో కాసేపట్లో పొలింగ్ ప్రారంభం కానుంది. నిజామాబాద్‌లోని 60 డివిజన్లకు 488 పొలింగ్ కేంద్రాలు, బోధన్‌లో 38 వార్డులకు 111 కేంద్రాలు, ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 106 పోలింగ్ కేంద్రాలు, భీంగల్ లో 12 వార్డులకు 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొలింగ్ జరగనుంది.
News February 11, 2026
నవీపేట్: ASI పై హత్యాయత్నం.. నిందితుడికి 8 ఏళ్ల జైలు శిక్ష

నవీపేట్ సమీపంలో విధుల్లో ఉన్న ఏఎస్ఐ గంగాధర్‌పై ఆటోతో దాడికి పాల్పడిన కేసులో నిందితుడు కాంబ్లె గంగాధర్‌కు ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. నిజామాబాద్ మూడవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇంచార్జీ జడ్జి దుర్గా ప్రసాద్ ఈ తీర్పునిచ్చారు. 2025 జూలైలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరుకుతాననే భయంతో నిందితుడు పోలీసులపైకి ఆటోను దూసుకెళ్లాడు. శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
News February 11, 2026
NZB: పోటీలో మొత్తం 714 మంది అభ్యర్థులు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలలో మొత్తం 714 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి వివరించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అత్యధికంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 350 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. బోధన్‌లో 162 మంది, ఆర్మూర్‌లో 153 మంది, భీంగల్‌లో 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు.


