News August 16, 2024

NZB: రోడ్డు ప్రమాదాలపై సీపీ ఫోకస్.!

image

రోడ్డు ప్రమాదాలపై NZB CP కల్మేశ్వర్ ఫోకస్ పెట్టారు. రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా బండి నడపడం వంటి కారణాలను గుర్తించి జైలుకు పంపుతున్నారు. ఇప్పటి వరకు 800 కేసులు, 400మందికి జైలు శిక్ష పడేలా చేశారు. మైనర్లకు బండ్లు ఇవ్వొద్దని పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లాలో 767యాక్సిడెంట్లు జరగగా, 337మంది ప్రాణాలు కోల్పోయారు. 250మంది ఆస్పత్రిలో చేరగా ఇప్పటికీ కోలుకోలేదు.

Similar News

News September 19, 2024

NZB: డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నిఖత్ జరీన్

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీగా బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిఖత్ బుధవారం డీజీపీ జితేందర్‌ను కలిసి తన జాయినింగ్ ఆర్డర్ అందజేశారు.

News September 19, 2024

NZB: పాము కాటేస్తోంది.. జర భద్రం..!

image

వర్షాకాలం ఉండడంతో పాముల సంచారం అధికమైంది. పాము కాటుకు గురై.. మృతి చెందుతున్న ఘటనలు నిజామాబాద్ జిల్లాలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. గడ్డి పొదలు, పొలం గట్లను స్థావరం చేసుకుని ఉన్న పాములు రైతులను కాటేస్తున్నాయి. ఎక్కువ శాతంమంది నాటువైద్యంపై ఆధారపడి.. ప్రాణాలు కాపాడే విలువైన సమయాన్ని చేజేతులా జారవిడుస్తున్నారు. వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదన్న అపవాదు ఉంది.

News September 19, 2024

బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ పోస్టు

image

నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ పోస్టు ఇచ్చింది. ఈమేరకు బుధవారం రాష్ట్ర డీజీపీ జితేందర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఆమె ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 1 పోస్టు అయిన డీఎస్పీగా నిఖత్ జరీన్ నియమించింది.