News January 24, 2025

NZB: లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

image

నిజామాబాద్ ఆర్సపల్లి బైపాస్ రోడ్డులో లారీ ఢీకొని ఓ రైతు మృతి చెందినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు గురువారం తెలిపారు. ఆర్సపల్లికి చెందిన తరికంటి యాదయ్య(78) అర్సపల్లి శివారులోని తన వ్యవసాయ భూమిలో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా రైల్వే గేటు ముల మలుపు వద్ద లారీ ఢీకోట్టంది. ఈ ప్రమాదంలో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 24, 2025

NZB: లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

image

నిజామాబాద్ ఆర్సపల్లి బైపాస్ రోడ్డులో లారీ ఢీకొని ఓ రైతు మృతి చెందినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు గురువారం తెలిపారు. ఆర్సపల్లికి చెందిన తరికంటి యాదయ్య(78) అర్సపల్లి శివారులోని తన వ్యవసాయ భూమిలో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా రైల్వే గేటు మూల మలుపు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News January 24, 2025

NZB: గంజాయితో ఒకరి అరెస్ట్

image

నిజామాబాద్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీసులు గురువారం ఒకరిని గంజాయితో అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.స్వప్న తెలిపారు. నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా జునైద్ అనే ఓ యువకుడు 0.7 కిలోల గంజాయితో పట్టుబడ్డాడన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు స్వప్న వివరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాం కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు రాజన్న, భూమన్న, కానిస్టేబుళ్లు భోజన్న, సుకన్య పాల్గొన్నారన్నారు.

News January 24, 2025

ఆర్మూర్: ఆదిలాబాద్ నుంచి గంజాయి తెచ్చి విక్రయాలు

image

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఆర్మూర్ చుట్టుపక్కల చిన్న చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్న ఇద్దరిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు ఆర్మూర్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ K. స్టీవెన్సన్ తెలిపారు. తొర్లికొండకు చెందిన నూనె కిరణ్, అంకాపూర్ లో ఉంటున్న నూనె శ్రీకాంత్ లు అక్రమంగా గంజాయిని విక్రయాల కోసం బైక్ పై రవాణా చేస్తూ అంకాపూర్ వద్ద పట్టుబడ్డారని CIవివరించారు.