News January 24, 2025

NZB: లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

image

నిజామాబాద్ ఆర్సపల్లి బైపాస్ రోడ్డులో లారీ ఢీకొని ఓ రైతు మృతి చెందినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు గురువారం తెలిపారు. ఆర్సపల్లికి చెందిన తరికంటి యాదయ్య(78) అర్సపల్లి శివారులోని తన వ్యవసాయ భూమిలో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా రైల్వే గేటు మూల మలుపు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News July 7, 2025

NZB: ఈ నెల 13న ఊర పండుగ

image

ఈ నెల 13న నిజామాబాద్ ఊర పండుగ నిర్వహించనున్నట్లు నగర సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం నిజామాబాద్‌లోని సిర్నాపల్లి గడిలో పండుగ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఊర పండుగను పురస్కరించుకొని ఖిల్లా చౌరస్తా నుంచి పెద్దబజార్, ఆర్య సమాజ్, గోల్ హనుమాన్ మీదుగా వినాయక్ నగర్ వరకు గ్రామ దేవతల ఊరేగింపు ఉంటుందన్నారు. గురువారం బండారు వేయనున్నట్లు పేర్కొన్నారు.

News July 6, 2025

నిజామాబాద్: SGT సమస్యలు పరిష్కరించాలని వినతి

image

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని SGTU నాయకులు కోరారు. ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కరీంనగర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేసే టీచర్స్‌కు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు. B.Ed, D.Ed వారికి కామన్ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు కల్పించాలని SGTU అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి కోరారు.

News July 6, 2025

NZB: రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: కవిత

image

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఏకలవ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజికవర్గానికి అన్ని పార్టీలు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని సూచించారు.