News September 28, 2024
NZB: వచ్చే నెల 5న TGO అసోసియేషన్ ఎన్నికలు

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఎన్నికలు వచ్చే నెల (అక్టోబర్)5 నిర్వహించనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారి, MVI కె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 5న నామినేషన్లు, స్క్రూటినీ, విత్ డ్రాలతో పాటు ఎన్నిక పక్రియ ఉంటుందని ఆయన వివరించారు.
Similar News
News November 28, 2025
నిజామాబాద్: విద్యను కార్పొరేట్ ఉత్పత్తి సాధనంగా మార్చాయి

దేశంలో విద్యను కార్పొరేటు ఉత్పత్తి సాధనంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చాయని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా 23వ మహాసభలు ఆర్మూర్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆర్మూర్‌లోని హనుమాన్ ఆలయం నుంచి CVR జూనియర్ కళాశాల వరకు వేలాది మంది విద్యార్థులతో విద్యార్థి ప్రదర్శన, అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
News November 28, 2025
ర్యాలీలకు అనుమతి తప్పనిసరి: NZB సీపీ

నిజామాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎవరైనా ర్యాలీలు నిర్వహించాలంటే సంబంధిత రిటర్నింగ్ అధికారి, పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని సీపీ సాయి చైతన్య తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్టపరమైన చర్యలకు కారణం అవుతుందన్నారు. జిల్లా పరిధిలో డీజేల వాడకం పూర్తిగా నిషేధం అన్నారు.
News November 28, 2025
NZB: సమస్యలపై పోరాడే వారిని బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలి

న్యాయం కోసం పాటుపడే న్యాయవాదుల సమస్యలపై పోరాడే వ్యక్తులకు జనవరిలో జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం NZB జిల్లా బార్ అసోసియేషన్‌లో నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులపై జరుగుతున్న హత్యలు, అక్రమాలు దాడులు మొదలగునవి అరికట్టడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆక్ట్ బిల్ ఎంతో అవసరం అన్నారు.


