News March 9, 2025
NZB: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP వెంకట్ రెడ్డి తెలిపారు. నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సాదక్, దొడ్డి కొమరయ్య కాలానికి చెందిన సురేకర్ ప్రకాశ్, సాయినాథ్ విట్టల్ రావు ముక్తే, నాగారానికి చెందిన సయ్యద్ షాదుల్లా అనే నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి రూ.10.17 లక్షల నగదుతో పాటు, చోరీకి వినియోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Similar News
News March 10, 2025
నిజామాబాద్ జిల్లాకు రూ.600 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు ధీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు రూ.200 కోట్ల చొప్పున రూ.600 కోట్లు మంజూరయ్యాయి.
News March 10, 2025
NZB: ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలను ఖండించిన ఉర్దూ అకాడమీ ఛైర్మన్

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ నిజామాబాద్ అర్వింద్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోబోమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ జవహర్ నవోదయపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇంకా స్థల సేకరణ చేపట్టలేదన్నారు. కేవలం ప్రతిపాదనలు మాత్రమే వెళ్లాయని అప్పుడే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై నోరు పారేసుకోవడం తగదన్నారు.
News March 10, 2025
NZB: విద్యార్థిని చితికబాదిన హాస్టల్ వార్డెన్

NZBలోని ఓ ప్రైవేటు కాలేజ్‌లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి వాహజుద్దీన్‌ను చదవకుండా నిద్రపోతున్నాడని ఆదివారం హాస్టల్ ఫ్లోర్ ఇన్‌ఛార్జ్ నిఖిల్ అనే వార్డెన్ కొట్టడంతో గాయాలయ్యాయి. విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపారు. వెంటనే అక్కడికి చేరి ప్రిన్సిపల్ హనుమంతరావుకు అడగగా హాస్టల్లో ఎలాంటి ఘటన జరగలేదన్నారు. తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.