News March 4, 2025
NZB: వర్క్‌ఫ్రం హోమ్.. రూ. 90,300 మోసపోయిన యువతి

వర్క్‌ఫ్రం హోమ్ పేరుతో ఓ యువతి మోసపోయినట్లు నిజామాబాద్ 1టౌన్ SHO రఘుపతి తెలిపారు. రామ్ గోపాల్ స్ట్రీట్‌కు చెందిన యువతి ఫేస్‌బుక్‌లో రిల్స్ చూస్తుండగా వర్క్ ఫ్రం హోమ్ అనే యాడ్ చూసి ఆకర్షితులై ఓ నంబరుకు వాట్సాప్ ద్వారా లింక్ పంపింది. తన బ్యాంక్ వివరాలను పంపి, రిజిస్ట్రేషన్ ఫీ 90,300 ఫోన్ పే ద్వారా చెల్లించింది. దీంతో మోసపోయానని భావించి వన్ టౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Similar News
News February 26, 2026
NZB: ‘సైక్లింగ్ క్రీడాభివృద్ధికి కృషిచేస్తా’

నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ సంఘం నూతన ప్రధాన కార్యదర్శి భూలోక విజయ్ కాంత్ రావు గురువారం జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో సైక్లింగ్ క్రీడను అభివృద్ధి చేసేందుకు క్రీడా సంస్థ తరపున పూర్తి సహకారం అందిస్తామని డీవైఎస్‌ఓ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
News February 26, 2026
BREAKING: నిజామాబాద్ అదనపు కలెక్టర్ బదిలీ

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న అంకిత్ (2019 బ్యాచ్) కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ CS రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అంకిత్‌ను భద్రాద్రి కొత్త గూడెం కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్‌ను TGSPDCL ఛైర్మన్&MDగా బదిలీ చేశారు.
News February 26, 2026
NZB: 40 పాఠశాలలకు పీఎం శ్రీ నిధులు: కలెక్టర్

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌తో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలో 40 పాఠశాలలకు పీఎం శ్రీ పథకం కింద నిధులను మంజూరయ్యాయని తెలిపారు.


