News March 4, 2025
NZB: వర్క్‌ఫ్రం హోమ్.. రూ. 90,300 మోసపోయిన యువతి

వర్క్‌ఫ్రం హోమ్ పేరుతో ఓ యువతి మోసపోయినట్లు నిజామాబాద్ 1టౌన్ SHO రఘుపతి తెలిపారు. రామ్ గోపాల్ స్ట్రీట్‌కు చెందిన యువతి ఫేస్‌బుక్‌లో రిల్స్ చూస్తుండగా వర్క్ ఫ్రం హోమ్ అనే యాడ్ చూసి ఆకర్షితులై ఓ నంబరుకు వాట్సాప్ ద్వారా లింక్ పంపింది. తన బ్యాంక్ వివరాలను పంపి, రిజిస్ట్రేషన్ ఫీ 90,300 ఫోన్ పే ద్వారా చెల్లించింది. దీంతో మోసపోయానని భావించి వన్ టౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Similar News
News March 26, 2025
డిచ్‌పల్లి: చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలి: కలెక్టర్

మానవతా సదన్ చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అనాధ బాలలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు వీలుగా ఇది వరకు జిల్లాలో కలెక్టర్‌గా కొనసాగిన ప్రస్తుత రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా తన హయాంలో 2016లో నెలకొల్పారు. మానవతా సదన్ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రత్యేకతను చాటుకుంటోందని అన్నారు.
News March 26, 2025
NZB: ఆస్తి పన్ను చెల్లింపు కోసం వన్‌టైం సెటిల్మెంట్: కలెక్టర్

ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులపై రాయితీ సదుపాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్‌ను అమలు చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆస్తి పన్ను బకాయి ఉన్న వారు నిర్ణీత గడువు లోపు ఒకే విడతలో బకాయిలు చెల్లిస్తే, 90 శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుందని అన్నారు. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News March 26, 2025
నిజామాబాద్ POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18 ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. నిజామాబాద్ డీసీసీ చీఫ్‌గా మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి వెళ్లారు. ఆయనకు ఇటీవల రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మన్‌ను అప్పగించారు.