News October 28, 2024
NZB: వర్ని మండలంలో చిరుత ఆనవాళ్లు..!

వర్ని మండలం కూనిపూర్ శివాలయం పరిసరాల్లో చిరుత అడుగుల ఆనవాళ్లను పలువురు గ్రామస్థులు గుర్తించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు శబ్దాలు చేసుకుంటూ వెళ్లాలని గ్రామ పెద్దలు సూచించారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే అవి చిరుత పులి అడుగులా, లేదా మరేదైనా జంతువు గుర్తులా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 25, 2025
26న BRS సన్నాహక సమావేశం: జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈనెల 29న నిర్వహించనున్న ‘దీక్షా దివస్’ను విజయవంతం చేయడానికి నిజామాబాద్లో ఈ నెల 26న సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 ఒక మైలురాయి లాంటిదని ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందని ఆయన గుర్తు చేశారు.
News November 25, 2025
నిజామాబాద్ జిల్లాలో అతివలే కీలకం

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు విడుదల చేసిన ఓటరు తుది జాబితా ప్రకారం నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాలో మొత్తం 8,51,417 మంది ఓటర్లు ఉండగా మహిళలు 4,54,621 మంది ఉన్నారు. ARMR డివిజన్లో 1,95,092 మంది, BDN డివిజన్లో 1,21,591 మంది, NZB డివిజన్లో 1,46,938 మంది మహిళలు ఉన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పురుషులు 3,96,778 మంది ఉన్నారు. ఇతరులు 18 మంది ఉన్నారు.
News November 25, 2025
NZB జిల్లాలో ఎవరికి ఎన్ని సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు అంటే?

నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. 100% ST GP ల్లో ST (W) -33, ST(Gen) 38, నాన్ షెడ్యూల్ ఏరియాల్లో ST(W) 8, ST(Gen) 17, SC(W) 35, SC (Gen) 47, BC(W) 55, BC (Gen) 70, అన్ రిజర్వ్డ్ పంచాయతీల్లో మహిళలకు 113, పురుషులకు 129 వార్డులను రిజర్వ్ చేసినట్లు అధికారులు తెలిపారు.


