News October 28, 2024

NZB: వర్ని మండలంలో చిరుత ఆనవాళ్లు..!

image

వర్ని మండలం కూనిపూర్ శివాలయం పరిసరాల్లో చిరుత అడుగుల ఆనవాళ్లను పలువురు గ్రామస్థులు గుర్తించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు శబ్దాలు చేసుకుంటూ వెళ్లాలని గ్రామ పెద్దలు సూచించారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే అవి చిరుత పులి అడుగులా, లేదా మరేదైనా జంతువు గుర్తులా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 13, 2024

టీయూ: డిగ్రీ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జులై/ఆగస్టులో జరిగిన డిగ్రీ కళాశాలల పరీక్షల ఫలితాల రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు తమ కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ.అరుణ తెలిపారు. డిగ్రీ 1, 2, 3, 4, 5, 6 సెమిస్టర్స్ బ్యాక్ లాగ్స్ కోసం వన్ టైం ఛాన్స్ కింద అవకాశం ఇచ్చామన్నారు. వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్‌ను సందర్శించాలని కోరారు.

News November 13, 2024

నిజామాబాద్ జిల్లాలో పలు రైళ్లు రద్దు

image

మంగళవారం రాత్రి పెద్దపల్లి-రాఘవాపూర్ దగ్గర ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. నిజామాబాద్-కాచిగూడ, గుంతకల్లు, బోధన్, కరీంనగర్-బోధన్ మధ్య నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News November 13, 2024

జక్రాన్‌పల్లి: నిప్పు అంటుకొని వృద్ధుడు మృతి

image

ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని వృద్ధుడు మృతి చెందినట్లు జక్రాన్ పల్లి ఎస్ఐ తిరుపతి తెలిపారు. గ్రామానికి చెందిన నడిపి గంగాధర్ (67) సోమవారం ఇంట్లో మంచంపై పడుకుని బీడీ తాగుతుండగా బీడీకి ఉన్న నిప్పు రవ్వలు మంచంపై పడ్డాయి. దీంతో మంచం కాలిపోయి గంగారం తీవ్ర గాయాల పాలయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మంగళవారం మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.