News February 8, 2025

NZB: వాహనాలు నడుపుతున్నారా..? నిబంధనలు పాటించాల్సిందే!

image

వాహనదారులకు నిజామాబాద్, కామారెడ్డి పోలీసులు పలు సూచనలు చేశారు. ఇటీవల పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
> పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు.
> వాహన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉండాల్సిందే.
> బైకర్లు ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు.
> హెల్మెట్ లేకుండా బైక్ నడపొద్దు.
> అతివేగంగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..
> నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు SHARE IT

Similar News

News November 28, 2025

NZB: రెండో రోజు 450 నామినేషన్లు

image

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో జరగనున్న GP ఎన్నికల్లో రెండో రోజు శుక్రవారం 184 సర్పంచి స్థానాలకు 164 నామినేషన్లు, 1,642 వార్డు మెంబర్ల స్థానాలకు 286 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

News November 28, 2025

NZB: పోలీసు సిబ్బందికి ఉలన్ బ్లాంకెట్స్, టీ షర్ట్స్ అందజేత

image

చలికాలంలో విధుల నిర్వహణ కష్టమవుతోందని ముందు జాగ్రత్తగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్‌లోని ఏఆర్, సివిల్ పోలీస్ సిబ్బందికి ఉలెన్ బ్లాంకెట్స్, టీ షర్ట్స్ అందజేశారు. చలికాలంలో ప్రతి ఒక్కరూ ఉలెన్ బ్లాంకెట్స్ సద్వినియోగం చేసుకోవాలని, విధి నిర్వహణలో క్యారీ చేసి ఉపయోగించుకోవాలని సీపీ సూచించారు.

News November 28, 2025

నిజామాబాద్: నామినేషన్ అభ్యర్థలకు కొత్త బ్యాంక్ అకౌంట్ కష్టాలు

image

గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచి, వార్డు సభ్యులు నామినేషన్ పత్రాలతో జీరో అకౌంట్ బ్యాంక్ ఖాతాను జతచేయాలని అధికారులు నిబంధనలు జారీ చేశారు. ఈ సమాచారం తెలియని అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. కాగా అభ్యర్ధులకు జీరో అకౌంట్ ఖాతాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. కొత్త నిబంధన వల్ల అభ్యర్ధులు బ్యాంక్‌లకు క్యూ కడుతున్నారు.