News February 8, 2025

NZB: వాహనాలు నడుపుతున్నారా..? నిబంధనలు పాటించాల్సిందే!

image

వాహనదారులకు నిజామాబాద్, కామారెడ్డి పోలీసులు పలు సూచనలు చేశారు. ఇటీవల పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
> పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు.
> వాహన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉండాల్సిందే.
> బైకర్లు ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు.
> హెల్మెట్ లేకుండా బైక్ నడపొద్దు.
> అతివేగంగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..
> నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు SHARE IT

Similar News

News February 8, 2025

సోన్: నిజాయితీని చాటుకున్న ఉపాధ్యాయులు

image

నిర్మల్ మండలం కౌట్ల (కె) గ్రామానికి చెందిన గురుకుల ఉపాధ్యాయులు భూమేష్, శ్రీధర్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం వారు సోన్ వైపు వెళ్తుండగా వారికి ఓ పర్సు దొరికింది. అందులో ఉన్న రూ.5000 ఉన్నాయి. ఆధార్ కార్డు ఆ పర్సు ఎవరిదో కనుక్కొని సదరు మహిళకు అందజేశారు. 

News February 8, 2025

పాడేరు: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి

image

ఆకాంక్ష జిల్లాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు సుమన్ కుమార్ బేరీ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ఆకాంక్ష బ్లాక్‌ల అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. మారుమూల గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందాలన్నారు. వైద్య ఆరోగ్య సేవలు, పోషకాహారం, వ్యవసాయం నీటిపారుదల సదుపాయాలు, ఆర్థిక చేకూర్పు, నైపుణ్యాభివృద్ధి మారుమూల గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.

News February 8, 2025

కొత్త రేషన్ కార్డులకు ఈసీ బ్రేక్

image

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. కొత్త రేషన్ కార్డులకు మీసేవలో దరఖాస్తులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటిని తక్షణమే నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది.

error: Content is protected !!