News November 30, 2024
NZB: విద్యార్థి మృతి.. కేసు నమోదు
నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నాలుగో టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. బోధన్‌కు చెందిన శివజశ్విత్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే జ్వరంతో శుక్రవారం విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు 4వ టౌన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ విచారణ చేపట్టారు.
Similar News
News December 13, 2024
కామారెడ్డి: మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లాలో పర్యటనకు వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుక్రవారం గొర్గల్ గ్రామ హెలిప్యాడ్ వద్ద జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. మంత్రి వెంట బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉన్నారు.
News December 13, 2024
BREAKING: NZB: బాలికతో అసభ్య ప్రవర్తన.. కొట్టి చంపారు!
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఆమె బంధువులు, స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన అతడు చికిత్స పొందుతూ మృతిచెందగా శుక్రవారం ఉదయం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
News December 13, 2024
నిజామాబాద్: విధుల నుంచి తొలగిస్తే పోరాటం తప్పదు: MLC కవిత
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వం చూస్తోందని NZB ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈ విషయంలో తమకు నిర్దిష్టమైన సమాచారం ఉందని, అదే జరిగితే మరో పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని ఆమె ‘X’ వేదికగా గురువారం హెచ్చరించారు. విధుల నుంచి తొలగించాలన్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మీ కామెంట్?