News June 10, 2024

NZB: విధుల్లో చేరనున్న 88 మంది PTI, 19 మంది CGVలు

image

2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, భవిత కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు (PTI), కేర్‌ గివింగ్‌ వాలంటీర్లు (CGV)లను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని సమగ్ర శిక్ష ఎక్స్‌ అఫిషియో స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ డా.మల్లయ్య భట్టు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 88 మంది PTIలు, 19 మంది CGVలు విధుల్లో చేరనున్నారు.

Similar News

News March 24, 2025

ధర్పల్లి: పది పరీక్ష రాయాలంటే రూ.5 వేలు ఇవ్వాల్సిందే

image

ధర్పల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యం అక్రమాలకు తెరలేపినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పదో తరగతి పరీక్షల్లో కాపీ చేయాలంటే ఒక్కో విద్యార్థి రూ.5 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని, తక్కువ ఇస్తే ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మామూళ్లు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యం డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

News March 24, 2025

పోతంగల్ : అగ్నిప్రమాదం.. ఇంట్లో వస్తువులన్నీ దగ్ధం

image

పోతంగల్ మండలం కల్లూరుగ్రామంలో అగ్నిప్రమాదం సంభవించి రేకుల ఇల్లు పూర్తిగా దగ్ధమై రూ.2లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన బీర్కూర్ భారతి, గంగారాంలు సోమవారం ఉదయం ఇంటిలో పూజా కార్యక్రమాలు ముగించుకొని కూలి పనికి వెళ్లారు. దేవుడి చిత్రపటాల వద్ద వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు కింద పడడంతో మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది.

News March 24, 2025

నిజామాబాద్: మళ్లీ పెరిగిన ఎండ తీవ్రత

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత మళ్లీ పెరిగింది. ఉదయం పూట చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది. ఆదివారం కోటగిరి మండల కేంద్రంలో 41℃ ఉష్ణోగ్రత, ముగ్పాల్ మండలంలోని మంచిప్పలో 40.6, కమ్మర్పల్లి, మెండోరా మండల కేంద్రంలో 40.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది.

error: Content is protected !!